Gold theft: బ్యాంకు నుంచి రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీ

మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఓ బ్యాంకు నుంచి బిహార్‌కు చెందిన దొంగల ముఠా దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.3.5 లక్షల నగదును దోచుకెళ్లింది.

Updated : 28 Nov 2022 07:12 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఓ బ్యాంకు నుంచి బిహార్‌కు చెందిన దొంగల ముఠా దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారం, రూ.3.5 లక్షల నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ముసుగులు ధరించిన ఆరుగురు దొంగలు ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి ఈ దోపిడీకి పాల్పడినట్లు ఎస్పీ ఎస్‌కే జైన్‌ వెల్లడించారు. బార్గవాన్‌ ప్రాంతంలో ఉన్న ఈ బ్యాంకుకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవని.. ఇదే అదనుగా భావించిన దొంగలు బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకులతో సిబ్బందిని బెదిరించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠాలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఉన్నారని.. వీరంతా బిహార్‌ వాసులని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు