సీబీఐ నకిలీ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అరెస్టు
సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి డబ్బులు దండుకుంటున్న కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది.
ఈనాడు, దిల్లీ: సీబీఐ అధికారిగా చలామణీ అవుతూ పనులు చేయిస్తానని చెప్పి డబ్బులు దండుకుంటున్న కొవ్విరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. విశాఖపట్నంలోని చినవాల్తేరుకు చెందిన ఇతన్ని దిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఐపీఎస్ అధికారినని, సీబీఐ ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతుండటంతో వల వేసి పట్టుకున్నారు. ఇతనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లోని రాజకీయ, అధికారవర్గాల్లో పట్టు ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సీబీఐ అధికారులు తమిళనాడు భవన్‌కు వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సోదాలు చేస్తుండగా నిందితుడు సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడే ప్రయత్నం చేశారు. చట్టబద్ధమైన నిబంధనలు పూర్తిచేసిన తర్వాత అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని ఫోన్‌ను సీజ్ చేశారు. తాను సీబీఐ, ఐపీఎస్ అధికారినని చెప్పుకొనేలా వాట్సప్ డీపీ పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంగా రూ.21 లక్షల నగదు, బంగారం, రాళ్లతో పొదిగిన నగలు, పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఐపీఎస్ అధికారిగా చెప్పుకొనే నకిలీ పత్రాలు, కారును సీబీఐ స్వాధీనం చేసుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కేజ్రీవాల్ రాజీనామాకు భాజపా డిమాండ్.. ఆప్ కార్యాలయం ముందు ఆందోళన
-
India News
Bill Gates: రోటీ చేసిన బిల్‌గేట్స్.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
Sports News
IND vs AUS: టీమ్ఇండియా ‘తగ్గేదేలే’.. నెట్‌బౌలర్లుగా నలుగురు టాప్ స్పిన్నర్లు!
-
Movies News
vani jayaram: ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత
-
Politics News
TS Assembly: దేశం చూపు కేసీఆర్ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్