ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

కాపలాదారులను తాళ్లతో కట్టేసి ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.11.57 లక్షల విలువైన 7087 మద్యం సీసాలను అపహరించుకుపోయారు.

Published : 30 Nov 2022 06:54 IST

కాపలాదారులను తాళ్లతో కట్టేసి.. రూ.11.57 లక్షల సరకు అపహరణ

లావేరు, న్యూస్‌టుడే: కాపలాదారులను తాళ్లతో కట్టేసి ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.11.57 లక్షల విలువైన 7087 మద్యం సీసాలను అపహరించుకుపోయారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక పంచాయతీ గుంటుకుపేటలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కాపలాదారులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుంటుకుపేట కూడలిలోని మద్యం దుకాణం వద్దకు సుమారు 11 మంది ఓ వ్యానులో వచ్చారు. అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్‌, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి తాళ్లతో కట్టేశారు. వారి వద్దనున్న ఫోన్లు, ద్విచక్ర వాహనం తాళాలను తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు వీరి వద్ద కాపలాగా ఉండి మిగిలిన వారు దుకాణం వద్ద చోరీకి పాల్పడ్డారు. గోడకు పెద్ద రంధ్రం పెట్టి అందులో నుంచి మద్యం సీసాలను తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ జి.ఆర్‌.రాధిక, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ మహేంద్ర మంగళవారం ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు