బాలికలకు మత్తు పదార్థాలు విక్రయించారని వైకాపా సోషల్‌ మీడియా కన్వీనర్‌పై కేసు

బాలికలకు మత్తు పదార్థాలు విక్రయించారని వైకాపా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ నవీన్‌రెడ్డిపై కేసు నమోదైంది.

Updated : 30 Nov 2022 06:48 IST

ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు

చంద్రగిరి, న్యూస్‌టుడే: బాలికలకు మత్తు పదార్థాలు విక్రయించారని వైకాపా తిరుపతి జిల్లా చంద్రగిరి మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ నవీన్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఒక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. చంద్రగిరి పాతపేటకు చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి ఆరా తీశారు. పాఠశాల ఎదురుగా ఉన్న టీకొట్టు వద్ద ఉందన్న సమాచారంతో వెళ్లి దుకాణ యజమాని, వైకాపాకు చెందిన నవీన్‌రెడ్డిని వారు నిలదీశారు. బాలిక సిగరెట్‌ అడిగితే ఇచ్చామని, కొట్టుకు వచ్చి ఎవరు అడిగినా ఇస్తామంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఆయన కులం పేరుతో దూషించారంటూ దంపతులు పోలీసు స్టేషన్‌ వద్దకు వెళ్లారు. పోలీసులు రాజీ ప్రయత్నాలు చేయడంపై బాలిక తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. విషయం బహిర్గతం కావడంతో అర్ధరాత్రి వేళ నవీన్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసుతోపాటు బాలికలకు మత్తు పదార్థాలు విక్రయించారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెదేపా, ఆమ్‌ఆద్మీ, ఎమ్మార్పీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాలిక తల్లిదండ్రులకు అండగా ఆందోళనకు దిగారు. విద్యార్థులను మత్తుకు బానిసలు చేస్తున్న మాఫియా ముఠాపై చర్యలు చేపట్టాలంటూ ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు