Andhra News: చెక్‌డ్యాంను పేల్చి వేసిన రైతు.. నిర్మిత స్థలం తన పూర్వీకులదంటూ దుశ్చర్య

తమ పూర్వీకుల పొలంలో జల వనరులశాఖ చెక్‌డ్యాం నిర్మించిందంటూ పేల్చివేసిన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని నల్లవాగులో 2018లో రూ.9.5 లక్షలతో జల వనరులశాఖ చెక్‌డ్యామ్‌ నిర్మించింది.

Updated : 30 Nov 2022 08:41 IST

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: తమ పూర్వీకుల పొలంలో జల వనరులశాఖ చెక్‌డ్యాం నిర్మించిందంటూ పేల్చివేసిన సంఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో చోటుచేసుకుంది. గ్రామంలోని నల్లవాగులో 2018లో రూ.9.5 లక్షలతో జల వనరులశాఖ చెక్‌డ్యామ్‌ నిర్మించింది. ఈ ప్రదేశం తమ పూర్వీకులదని, కొన్నేళ్లుగా సాగు చేసుకున్న భూమిలో చెక్‌డ్యామ్‌ కట్టారంటూ మల్లికార్జున.. ఆదివారం రాత్రి బాంబులతో దాన్ని పేల్చి వేశారు.

జల వనరులశాఖ ఫిర్యాదు మేరకు తహసీల్దారు వేణుగోపాల్‌, సీఐ మారుతీకృష్ణ మంగళవారం సంఘటన స్థలానికి వచ్చారు. ఆ ప్రాంతాన్ని సర్వే చేయించారు. 236-3లో 4.77 ఎకరాల చుక్కల భూమిలో చెక్‌డ్యామ్‌ నిర్మించారని తహసీల్దారు తెలిపారు. అది మల్లికార్జున పేరుపై లేదని, ఇతరుల పేరుపై ఉందని పేర్కొన్నారు. సంఘటనకు పాల్పడ్డ మల్లికార్జున పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని