అటవీశాఖ తనిఖీ కేంద్రం నుంచి 17 తుపాకుల లూటీ
మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి 17 తుపాకులను దోచుకెళ్లారు.
మధ్యప్రదేశ్‌లో ఘటన
బుర్హాన్‌పుర్: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి 17 తుపాకులను దోచుకెళ్లారు. నవ్రా అటవీ ప్రాంతంలోని బక్డి పోస్ట్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 15నుంచి 20 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇక్కడ అటవీ భూముల ఆక్రమణలు, అనధికారికంగా చెట్ల నరికివేతను అరికట్టేందుకు కొద్ది రోజులుగా అటవీశాఖ బృందాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?