సీఐ జగదీశ్‌పై అక్రమాస్తుల కేసు నమోదు
నిజామాబాద్‌కు చెందిన సీఐ జగదీశ్‌పై అక్రమాస్తుల కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి సీఐ ఇంట్లో సోదాలు జరిపిన అనిశా అధికారులు రూ.43.54 లక్షల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ప్రకటన విడుదల చేశారు.
రూ.43.54 లక్షల గుర్తింపు
రెండేళ్ల నుంచి సస్పెన్షన్‌లో అధికారి
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌కు చెందిన సీఐ జగదీశ్‌పై అక్రమాస్తుల కేసు నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి సీఐ ఇంట్లో సోదాలు జరిపిన అనిశా అధికారులు రూ.43.54 లక్షల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఇందులో రూ.9.12 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీఐ జగదీశ్ గతంలో కామారెడ్డి పట్టణ సీఐగా పనిచేశారు. ఐపీఎల్ బెట్టింగ్‌కు సంబంధించిన ఓ కేసులో బెయిల్ ఇచ్చేందుకు లంచం డిమాండు చేయగా 2020 నవంబరు 21న అనిశా పట్టుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆయన బ్యాంకు లాకర్లు తెరిచి పలు అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే తనపై అనిశా అధికారులు తప్పుడు కేసు పెట్టారంటూ జగదీశ్ అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో తిరిగి మంగళవారం సీఐ ఇంట్లో అనిశా సోదాలు నిర్వహించింది.
* 2020 నవంబరులో సీఐ జగదీశ్ పట్టుబడిన తర్వాత విచారణలో భాగంగా అప్పటి కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్సై గోవింద్‌పై సైతం అనిశా వేర్వేరుగా కేసులు పెట్టింది. ప్రస్తుతం వీరు కూడా సస్పెన్షన్‌లో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!