ఢీకొట్టి... ఆపకుండా పరార్
పొట్టకూటి కోసం ఊరూవాడా తిరుగుతూ వంటపాత్రలను విక్రయించే ఇద్దరు మహిళలు..మరో పదడుగులు వేస్తే ఇల్లు చేరాల్సి ఉండగా బస్సు చక్రాల కింద నలిగి అసువులు బాశారు.
ఇద్దరు మహిళల దుర్మరణం
పట్టించుకోకుండా మూడుగంటల పాటు బస్సును నడిపిన డ్రైవర్
సీసీ ఫుటేజి ఆధారంగానిజామాబాద్లో పట్టివేత
ఈనాడు, కరీంనగర్-న్యూస్‌టుడే, మానకొండూర్: పొట్టకూటి కోసం ఊరూవాడా తిరుగుతూ వంటపాత్రలను విక్రయించే ఇద్దరు మహిళలు..మరో పదడుగులు వేస్తే ఇల్లు చేరాల్సి ఉండగా బస్సు చక్రాల కింద నలిగి అసువులు బాశారు. దారుణమేంటంటే.. మహిళలను ఢీకొట్టిన డ్రైవర్ వారికి ఏమైందని కూడా ఆలోచించకుండా..బస్సును ఆపకుండా తీసుకెళ్లిపోయాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా.. ఏమీకానట్లుగా.. ఎవరికీ తెలియదన్నట్లుగా ఏకంగా మరో మూడు గంటలపాటు ప్రయాణించి నిజామాబాద్ వరకు బస్సును తీసుకెళ్లిపోయాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా బస్సు బాన్సుబాడ డిపోకు చెందినదిగా గుర్తించి డ్రైవర్‌ను నిజామబాద్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మానకొండూర్ సీఐ రాజ్‌కుమార్ కథనం మేరకు.. మానకొండూర్ రాజీవ్ కాలనీకి చెందిన కడమంచి రాజమ్మ (41), పస్తం లక్ష్మి (36)లు ప్రయాణ ప్రాంగణం వద్ద టీ తాగేందుకు వచ్చి తిరిగి నడుచుకుంటూ వెళ్లే క్రమంలో వరంగల్ నుంచి కరీంనగర్ వైపునకు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వీరిని బలంగా ఢీకొట్టి పైనుంచి దూసుకెళ్లింది. దీంతో చక్రాల కింద నలిగిన వీరిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబాలను ఆర్టీసీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సాయంత్రం వారి సంబంధీకులు, కాలనీవాసులు రాస్తారోకో నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల
-
India News
Pakistan: పాకిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధితో 18 మంది మృతి
-
Politics News
Eknath Shinde: ‘2024లో ఎన్డీయేదే పవర్.. మోదీ అన్ని రికార్డులూ బ్రేక్ చేస్తారు’
-
General News
Taraka Ratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. కుప్పం చేరుకున్న బెంగళూరు వైద్య బృందం
-
Movies News
Social Look: చంద్రికా రవి ‘వాహనంలో పోజులు’.. ఐశ్వర్య ‘స్పై’ లుక్!
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!