విద్యార్థినిపై లైంగిక వేధింపులు

కాకినాడ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థిని పట్ల ఒప్పంద అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించిన ఘటన గురువారం వెలుగుచూసింది.

Updated : 02 Dec 2022 07:04 IST

జేఎన్‌టీయూకేలో ఒప్పంద అధ్యాపకుడి తొలగింపు

వెంకట్‌నగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థిని పట్ల ఒప్పంద అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించిన ఘటన గురువారం వెలుగుచూసింది. ఎస్‌.వి.ఎన్‌.కుమార్‌ 2010 నుంచి వర్సీటీలో ఎంబీఏ విభాగంలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా అతడు సదరు విద్యార్థినితో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో వేధింపులు శ్రుతిమించడంతో ఆ విద్యార్థిని నవంబరు 27న ఉపకులపతికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్‌, వర్సిటీలోని మహిళా సాధికారత అధికారులు, విభాగాధిపతి ద్వారా ఉపకులపతి విచారణ జరిపించారు. వేధింపులు నిర్ధారణ కావడంతో నవంబరు 28న ఒప్పంద అధ్యాపకుడిని విధుల నుంచి తొలగించినట్లు వీసీ ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని