నలుగురి సజీవ దహనం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రొయ్యల కంటైనర్‌ను ఇసుక లారీ ఢీకొంది.

Published : 03 Dec 2022 04:14 IST

డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి కంటైనర్‌ను ఢీకొన్న లారీ

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రొయ్యల కంటైనర్‌ను ఇసుక లారీ ఢీకొంది. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అందులోని నలుగురు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ వైపు వెళ్తున్న ఇసుక లారీ రహదారిపై డివైడర్‌ పైనుంచి దూసుకొచ్చి కంటైనర్‌ను బలంగా ఢీకొంది. కంటైనరు డీజిల్‌ ట్యాంకును నేరుగా లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా శబ్దంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఊంచిద్‌ గ్రామానికి చెందిన కంటైనరు డ్రైవరు వినోద్‌కుమార్‌ రాధేశ్యామ్‌ యాదవ్‌(27), అందులో ఉన్న భీమవరం జిల్లా యనమదుర్రు గ్రామానికి చెందిన సూపర్‌వైజర్‌ కాలి పెద్దిరాజు(45), కృష్ణా జిల్లా కోడూరు మండలం పాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఇసుక లారీ డ్రైవర్‌ జన్ను శ్రీను(45), ఇదే వాహనంలో ఉన్న మరో వ్యక్తి సజీవ దహనమయ్యారు. మంటలు అదుపు చేసేందుకు పోలీసులు, అగ్నిమాపక యంత్రాంగం రాత్రంతా శ్రమించారు. మృతదేహాలు కాలి ముద్దలుగా మారాయి. ప్రత్తిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని