ముగ్గురు బిడ్డలను కడతేర్చి.. తల్లి ఆత్మహత్య

భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఉస్మా కౌసర్‌ (30) ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.

Published : 03 Dec 2022 03:53 IST

భర్త వివాహేతర సంబంధమే కారణం

మండ్య, న్యూస్‌టుడే: భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న ఉస్మా కౌసర్‌ (30) ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. తన కుమారుడు హ్యారిస్‌ (7), కుమార్తెలు అలీసా (4), అనమ్‌ ఫాతిమా (2)లను గొంతు నులిమి హత్య చేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకొని.. ఆమె ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు తాలూకా హొళెబీదికి చెందిన అఖిల్‌ అహ్మద్‌తో ఉస్మా కౌసర్‌కు తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. చెన్నపట్టణలో అహ్మద్‌ కారు మెకానిక్‌. ఆమె ఒక క్లినిక్‌లో పని చేసేది. భర్త సెల్‌ఫోన్‌లో మరో యువతి నగ్న చిత్రాలు ఉండడం, ఆమెతో కలిసి చిత్రాలు ఉండడాన్ని గుర్తించి భర్తను ప్రశ్నించింది. ఇదే విషయమై వారిద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. విధులు ముగించుకుని గురువారం రాత్రి పొద్దుపోయాక అహ్మద్‌ ఇంటికి వచ్చేసరికి భార్య, బిడ్డలు విగతజీవులుగా ఉండడాన్ని గుర్తించి.. భయంతో ఇల్లువదిలి పరారయ్యాడు. తల్లీ బిడ్డలు మరణించిన విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పరారైన అఖిల్‌ అహ్మద్‌ కోసం మద్దూరు ఠాణా పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని