విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

విద్యార్థులకు చదువుతో పాటు సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే వారి పట్ల వంకరబుద్ధి ప్రదర్శించడంతో తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Published : 03 Dec 2022 04:39 IST

దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు సత్ప్రవర్తన నేర్పించాల్సిన గురువే వారి పట్ల వంకరబుద్ధి ప్రదర్శించడంతో తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటన నిజామాబాద్‌లో జరిగింది. నిజామాబాద్‌లోని మోడర్న్‌ ఉన్నత పాఠశాల(ఎయిడెడ్‌)లో వెంకటరమణ జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా  పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఏడో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గురువారం రాత్రి ఓ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. శుక్రవారం వారు స్థానికులతో కలిసి పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఆగ్రహంతో ఎదురుతిరిగిన అతణ్ని పలువురు చితకబాదారు. ఈ ఘటనపై డీఈవో దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా.. నిందితుణ్ని పాఠశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించిందని, పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు’ ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని