అటవీ అధికారి ద్విచక్ర వాహనం దహనం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాళకుంట పొలాల్లో అటవీశాఖాధికారి ద్విచక్రవాహనాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు.
పెనుబల్లి, న్యూస్టుడే: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాళకుంట పొలాల్లో అటవీశాఖాధికారి ద్విచక్రవాహనాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. పెనుబల్లికి సమీప మండలమైన భద్రాద్రి జిల్లా చంద్రగొండ మండలం ఎర్రబోడులో ఇటీవల ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యకు గురికాగా... అక్కడికి 12 కి.మీ. దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మాళకుంట అటవీప్రాంతం సమీపంలో ఉన్న మామిడితోటలో వన్యమృగాల వేటకు ఆగంతుకులు విద్యుత్తు తీగలు అమర్చుతున్నారని లింగగూడెం సెక్షన్ అధికారి బానోత్ కాళీకి సమాచారం అందింది. ఆయన సిబ్బంది ఇద్దరిని తీసుకొని అక్కడకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. బైక్ను పంట పొలాల్లో ఉంచి లోపలకు వెళ్లారు. మామిడి తోట పక్కన జంతువుల వేటకు అమర్చిన తీగలను గుర్తించి తొలగిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనానికి ఎవరో వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై బాధితుడు బానోత్ కాళీ వి.ఎం.బంజర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!
-
Sports News
IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్ఇండియాకు తప్పని ఓటమి
-
Technology News
WhatsApp: మూడు ఆప్షన్లతో వాట్సాప్ టెక్స్ట్ ఎడిటర్ ఫీచర్!