నగ్న వీడియోలు బయటపెడతా..
యూఎస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ఆచార్యుడి నగ్న వీడియోలు అడ్డుపెట్టుకొని, బెదిరింపులకు దిగుతున్న దిల్లీ వాసిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
యూఎస్ ఆచార్యుడికి దిల్లీ నుంచి బెదిరింపులు
నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ
దిల్లీ: యూఎస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ఆచార్యుడి నగ్న వీడియోలు అడ్డుపెట్టుకొని, బెదిరింపులకు దిగుతున్న దిల్లీ వాసిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసులో మరో నిందితురాలి కోసం గాలిస్తున్నారు. దిల్లీలో అసోలా ప్రాంతానికి చెందిన రాహుల్ కుమార్ స్నేహితురాలు యూఎస్‌కు చెందిన ఆచార్యుడితో ఫేస్బుక్లో ఛాటింగ్ చేసింది. కొన్నాళ్లకు లైంగిక విషయాలు మాట్లాడుతూ నగ్నంగా వీడియో ఛాట్ చేసేలా ఆచార్యుడిని ప్రేరేపించింది. ఇలా నగ్నంగా వీడియో ఛాట్ చేస్తున్న క్రమంలో రాహుల్ వాటిని రికార్డు చేశాడు. ఆ వీడియోలు చూపి డబ్బు, విలువైన వస్తువులు పంపాలని ఆచార్యుడిని డిమాండు చేశారు. లేకపోతే వాటిని యూనివర్సిటీ పెద్దలు, అక్కడి ప్రముఖ పాత్రికేయులకు పంపుతానని బెదిరింపులకు దిగాడు. భయపడిన ప్రొఫెసర్ పలు దఫాలుగా పేపాల్ నుంచి 48 వేల యూఎస్ డాలర్లను పంపారు. ఇంకా విలువైన వస్తువులు కావాలని డిమాండు చేస్తుండటంతో విధిలేక సదరు ప్రొఫెసర్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును స్వీకరించిన ఎఫ్‌బీఐ.. మన దేశంలోని సీబీఐకి చెందిన ఇంటర్నేషనల్ ఆపరేషన్ డివిజన్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో నిందితుల ఫేస్బుక్ ఐడీలతో లొకేషన్ గుర్తించి రాహుల్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి