శ్రద్ధా బ్రేకప్‌ చెబుతానంది.. చంపేశా

శ్రద్ధా వాకర్‌ తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా నార్కో పరీక్షలో వెల్లడించాడు.

Published : 03 Dec 2022 06:34 IST

నార్కో పరీక్షలో ఆఫ్తాబ్‌ పూనావాలా

దిల్లీ: శ్రద్ధా వాకర్‌ తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా నార్కో పరీక్షలో వెల్లడించాడు. ఆఫ్తాబ్‌ తనను తరచూ వేధించడంతో శ్రద్ధా విడిపోవాలని నిర్ణయించుకుంది. తనకు బ్రేకప్‌ చెప్పాక శ్రద్ధా మరొకరితో వెళ్లిపోతుందేమోనని ఆవేశానికి గురై గొంతు నులిమి చంపేశానని ఆఫ్తాబ్‌ నార్కో పరీక్షలో తెలిపాడు. శ్రద్ధా హత్యకేసులో ఆఫ్తాబ్‌కు గురువారం నార్కో పరీక్ష పూర్తి కాగా.. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను అతడు వెల్లడించినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. శ్రద్ధా దేహాన్ని ముక్కలు చేసేందుకు రంపంతోపాటు ‘క్లీవర్‌’ (మాంసం కొట్లలో వాడే పెద్దకత్తి) ఉపయోగించానని, తర్వాత వాటిని గురుగ్రాం వద్ద ఎక్కడో పొదల్లో పడేసినట్లు చెప్పాడు. ఆమె తలను మెహ్రౌలీ అటవీప్రాంతంలో విసిరేశానని, మొబైల్‌ ఫోన్‌ను ముంబయి సముద్రంలో పారేసినట్లు వెల్లడించాడు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని