సినీ షూటింగ్‌లో స్టంట్‌ మాస్టర్‌ మృతి

సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశాత్తు స్టంట్‌ మాస్టర్‌ ప్రాణాలు కోల్పోయారు.

Updated : 04 Dec 2022 06:04 IST

టీనగర్‌, న్యూస్‌టుడే: సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ప్రమాదవశాత్తు స్టంట్‌ మాస్టర్‌ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం మేరకు.. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘విడుదలై ’ చిత్రం షూటింగ్‌ చెన్నై శివారులోని కేళంబాక్కంలో జరుగుతోంది. శనివారం చిత్రీకరణలో భాగంగా తాడుకు వేలాడుతున్న స్టంట్‌ మాస్టర్‌ సురేష్‌ ప్రమాదవశాత్తు తాడు తెగి కిందపడ్డారు. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని