బస్టాప్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు
రహదారి పక్కన బస్టాప్‌లో నిలుచున్నవారిపైకి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఆరుగురి ప్రాణాలను బలిగొంది.
మధ్యప్రదేశ్‌లో ఆరుగురి దుర్మరణం
రత్లాం: రహదారి పక్కన బస్టాప్‌లో నిలుచున్నవారిపైకి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఆరుగురి ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. రత్లాం-లేబాడ్ రహదారిలో శత్రుండా గ్రామం కూడలి బస్టాప్‌లో ఆదివారం సాయంత్రం పలువురు నిలుచున్నారు. ఆ సమయంలో ఓ ట్రక్కు వేగంగా బస్టాప్‌లోకి దూసుకొచ్చింది. దీంతో వాహనం కింద పడి ఆరుగురు వ్యక్తులు మరణించారు. 10మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జిల్లా కలెక్టర్ నరేంద్రకుమార్ సూర్యవంశి తెలిపారు. ప్రమాదం అనంతరం వాహనం డ్రైవర్ పరారయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!
-
Movies News
NTR: నా భార్య కంటే ముందు మీకే చెబుతా.. దర్శక- నిర్మాతలపై ఒత్తిడి తేవొద్దు: ఎన్టీఆర్
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Politics News
Congress: ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు కాంగ్రెస్‌తో చేయి కలపాలి: మాణిక్ రావ్ ఠాక్రే
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?