Heart Attack: భర్తకు గుండెపోటు.. భార్య సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
భార్య కళ్లెదుటే భర్త గుండెపోటుకు గురై కుప్పకూలి.. ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన ఇది.
సిరికొండ, న్యూస్టుడే: భార్య కళ్లెదుటే భర్త గుండెపోటుకు గురై కుప్పకూలి.. ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన ఇది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గిర్ని చౌరస్తాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకొంది. అంతవరకు సరదాగా మాట్లాడిన భర్త ఉన్నట్టుండి అచేతనంగా పడిపోవడంతో.. అతన్ని కాపాడుకోవడానికి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె పడిన వేదన చూపరులను కంటతడి పెట్టించింది. ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన సాగర్ (40) ట్యాక్సీడ్రైవర్గా పని చేస్తున్నారు. ఆయన భార్య వాసవి గ్రామంలో ఆశా కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.
సోమవారం ఉదయం సిరికొండ పీహెచ్సీలో సమావేశం ఉండగా తన ద్విచక్రవాహనంపై ఆయన భార్యను తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి వెళ్లే సమయంలో గిర్ని చౌరస్తా వద్ద ఆమెను దింపి పక్కనేఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్తుండగా ఒక్కసారిగా వాహనంపై నుంచి స్పృహతప్పి పడిపోయారు. గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన ఆమె వెంటనే సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేసి కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా సాగర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ
-
India News
Rahul Gandhi: ‘ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి’.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం
-
Sports News
IND vs NZ: బ్యాటర్లకు ‘పిచ్’ ఎక్కించింది.. ‘సుడులు’ తిప్పిన బౌలర్లు
-
Politics News
Nara Lokesh: వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం: నారా లోకేశ్
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్