శ్రీకాకుళం జిల్లాలో మండల ఉపాధ్యక్షుడి దారుణహత్య

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మం-4 ఎంపీటీసీ సభ్యుడు, మండల ఉపాధ్యక్షుడు, వైకాపా నాయకుడు బరాటం రామశేషు(45) దారుణ హత్యకు గురయ్యారు.

Published : 07 Dec 2022 04:05 IST

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మం-4 ఎంపీటీసీ సభ్యుడు, మండల ఉపాధ్యక్షుడు, వైకాపా నాయకుడు బరాటం రామశేషు(45) దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామశేషు మంగళవారం ఉదయం 6:30 సమయంలో శ్రీకూర్మం సునామీ కాలనీ సమీపంలోని దువ్వుపేట రోడ్డులో ఉన్న తన గ్యాస్‌ గోదాంవైపు నడకకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే కాపు కాసిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ఆయన దగ్గరకు వచ్చారు. కత్తితో మెడ, ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో రామశేషు అక్కడికక్కడే మృతి చెందారు. దాడికి పాల్పడిన వ్యక్తులు నంబరుప్లేటు లేని బండిపై శ్రీకూర్మం మీదుగా పరారయ్యారు. వీరిలో ఒకరు హెల్మెట్‌, ఇద్దరు మాస్క్‌లు ధరించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 2017 డిసెంబరులోనూ రామశేషుపై హత్యాయత్నం జరిగింది. డీఎస్పీ మహేంద్ర, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌.ఐ. ఎం.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు