పీఎఫ్‌ఐ కేసులో త్వరలో అరెస్టులు

పాఫులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో త్వరలోనే ఎన్‌ఐఏ మరిన్ని అరెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో శిక్షణ పొందిన వారి కోసం జల్లెడ పడుతున్న అధికారులు ఇప్పటివరకు గుర్తించిన 25 మందికి నోటీసులు ఇచ్చారు.

Updated : 07 Dec 2022 06:12 IST

శిక్షణ పొందిన వారిని విచారిస్తున్న ఎన్‌ఐఏ

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పాఫులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో త్వరలోనే ఎన్‌ఐఏ మరిన్ని అరెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో శిక్షణ పొందిన వారి కోసం జల్లెడ పడుతున్న అధికారులు ఇప్పటివరకు గుర్తించిన 25 మందికి నోటీసులు ఇచ్చారు. వీరు ఒక్కొక్కరు ఎన్‌ఐఏ అధికారుల ఎదుట హాజరై తమ వాంగ్మూలాన్ని సమర్పిస్తున్నారు. విచారణలో భాగంగా స్థానికంగా ఏర్పాటుచేసిన బృంద సహకారం తీసుకుంటున్నారు.

* నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐ పేరిట మతపరమైన దాడులకు కుట్ర పన్నినట్లు జులైలో గుర్తించారు. ఆ వెంటనే ఆరోఠాణాలో 29మందిపై కేసులు నమోదుచేసి.. మొదట నలుగురిని రిమాండుకు తరలించారు. తదుపరి జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అనంతరం ఈ సంస్థపై నిషేధం విధించటంతోపాటు వరుసగా అరెస్టులు, విచారణలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని