ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా సరిహద్దులోని మటకుప రిజర్వు అడవుల్లో జవాన్లు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు.

Published : 08 Dec 2022 04:50 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా సరిహద్దులోని మటకుప రిజర్వు అడవుల్లో జవాన్లు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదని ఐజీ(ఆపరేషన్స్‌) అమితాబ్‌ ఠాకూర్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు.  తాడికొల గ్రామ సమీపంలోని సంయుక్త బలగాలు కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు పసిగట్టి కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరినట్లు చెప్పారు. బలగాలు ఎదురుదాడికి దిగాయన్నారు. కాసేపటి తరువాత మావోయిస్టుల నుంచి కాల్పులు ఆగిపోయాయని, వెళ్లి చూడగా ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు పడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌తోపాటు మూడు దేశవాళీ తుపాకులు, 37 తూటాలు, ఐఈడీ, రూ.5,800ల నగదు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల్లో కొందరు గాయపడి ఉండొచ్చని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టులు కొంధమాల్‌-కలహండి-బౌద్ధ్‌-నయాగఢ్‌ (కేకేబీఎన్‌) డివిజన్‌కు చెందినవారు అయి ఉంటారన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని