యువతిపై సామూహిక అత్యాచారం

ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 08 Dec 2022 04:50 IST

ఒడిశాలోని ప్రభుత్వ కార్యాలయంలో ఘటన

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలోని ఆరోగ్యశాఖ ఛాంబర్‌లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సీనియర్‌ గుమస్తా, డ్రైవర్‌ కలిపి అకృత్యానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆదివారం కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లాక ఆదివారం రాత్రి కార్యాలయంలోనే ఉంచి ఇద్దరూ అత్యాచారం చేశారు’ అని సంబల్‌పూర్‌కు చెందిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని