పట్టాలపై పడిన బియ్యం ఏరుకుంటూ.. గూడ్స్ రైలు కిందపడి మహిళ దుర్మరణం
పట్టాలపై పడిన బియ్యాన్ని ఏరుకునే ప్రయత్నంలో ఓ మహిళ రైలు కింద పడి మరణించింది.
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టాలపై పడిన బియ్యాన్ని ఏరుకునే ప్రయత్నంలో ఓ మహిళ రైలు కింద పడి మరణించింది. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుధవారం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో చివరి ట్రాక్‌పై గూడ్స్ రైళ్లను నిలుపుతుంటారు. ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో బస్తాల నుంచి జారిపడే బియ్యం గింజలను ఏరుకునేందుకు కూలీలు, యాచకులు వస్తుంటారు. బుధవారం బియ్యం ఏరుకునే క్రమంలో ఓ మహిళ గూడ్స్ రైలు కిందికి వెళ్లారు. ఇంతలోనే రైలు కదలడంతో అక్కణ్నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. మృతురాలు పేరు గంగవ్వ అని ఆమెతోపాటు వచ్చినవారు చెప్పారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: ముజాహిదీన్లను సృష్టించి తప్పు చేశాం: పార్లమెంటులో పాక్ మంత్రి
-
Politics News
Padi Kaushik Reddy: హుజూరాబాద్‌లో భారాస అభ్యర్థిని నేనే: పాడి కౌశిక్‌రెడ్డి
-
Crime News
Hyderabad: బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
-
India News
పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి