అగ్నికి ఆహుతైన దివ్యాంగురాలు
దివ్యాంగురాలైన ఓ యువతి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది.
ఇంటికి మంటలు వ్యాపించడంతో ఘటన
గురుద్వారా, న్యూస్‌టుడే: దివ్యాంగురాలైన ఓ యువతి మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ఈ హృదయవిదారక ఘటన విశాఖ నగరంలోని సీతమ్మధార కొండవాలు ప్రాంతం బిలాల్‌కాలనీలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. బిలాల్కాలనీకి చెందిన సబ్బి వెంకట్రావు, భార్య కూలీ పనులు చేస్తుంటారు. వీరికి కుమార్తె రమ(19), కుమారుడు శేఖర్(14) సంతానం. వీరిద్దరూ దివ్యాంగులు. పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గురువారం ఇద్దరు పిల్లలతో పాటు వెంకట్రావు తల్లి చానమ్మ(75)ను ఇంటిలో ఉంచి భార్యాభర్తలిద్దరూ ఉదయాన్నే కూలి పనులకు వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల సమయంలో.. దేవుడి దగ్గర వెలిగించిన దీపం గుడిసెకు అంటుకుని ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు గుడిసెలో ఉన్న శేఖర్, చానమ్మను బయటకు తీసుకొచ్చి రక్షించగలిగారు. కదలలేని స్థితిలో ఉన్న రమను కాపాడేలోపే ఆమె శరీరమంతా మంటలు అంటుకుని సజీవ దహనమైంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు వార్డు కార్పొరేటర్ అనిల్‌కుమార్ రూ.10 వేలు సాయం అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth reddy: రాజ్‌భవన్ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్ రెడ్డి
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి భద్రత కుదింపు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్