Software Engineer: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ దంపతుల మృతి

కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 11 Dec 2022 07:08 IST

నాలుగేళ్ల కుమార్తె కూడా దుర్మరణం

ఉరవకొండ, న్యూస్‌టుడే: కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన దంపతులు, వారి కుమార్తె దుర్మరణం చెందారు. చిన్న ముష్టూరుకు చెందిన విశ్రాంత విద్యుత్తు ఉద్యోగి మాసినేని శ్రీరాములు తనయుడు శ్రీకాంత్‌ (41), కోడలు ప్రతీక్ష (35) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారికి కుమార్తె గమ్య (4), కుమారుడు దైవిక (2) సంతానం. కుమారుడిని అనంతపురంలో ఉంటున్న అమ్మమ్మ వద్ద వదిలిన దంపతులు.. శుక్రవారం రాత్రి తమ కుమార్తె గమ్యతో కలిసి బెంగళూరు నుంచి ధర్మస్థలం మంజునాథస్వామి దర్శనానికి వెళ్లారు. శనివారం దర్శనం ముగించుకుని కారులో శృంగేరికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారును ఉడిపి జిల్లా కార్కల ఠాణా పరిధిలో ఓ ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్‌, ప్రతీక్షతో పాటు వారి కుమార్తె గమ్య అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్‌ తల్లిదండ్రులు అనంతపురంలో ఉంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని