Hyderabad: ప్రియుడి ఇంట్లో ఉరేసుకుని ప్రియురాలు ఆత్మహత్య
ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్: ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దయాకర్, పూజ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. దయాకర్, పూజ పెళ్లికి దయాకర్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులను ఒప్పించాలన్న ఉద్దేశంతో దయాకర్.. పూజను ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నంలో ఉండగా.. దయాకర్ తల్లిదండ్రుల మాటలు విని తీవ్ర మనస్తాపానికి గురైన పూజ... పక్కనే ఉన్న గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుడు దయాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం