చెన్నైలో భారీగా పట్టుబడ్డ బంగారం

తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎనిమిది మంది ప్రయాణికుల వద్ద కస్టమ్స్‌ అధికారులు 3.15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబరు 28, 29వ తేదీల్లో దుబాయ్‌ నుంచి చెన్నై చేరుకున్న వీరిని తనిఖీ చేసిన అధికారులు బంగారం....

Published : 29 Nov 2020 21:43 IST

చెన్నై: తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎనిమిది మంది ప్రయాణికుల వద్ద కస్టమ్స్‌ అధికారులు 3.15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబరు 28, 29వ తేదీల్లో దుబాయ్‌ నుంచి చెన్నై చేరుకున్న వీరిని తనిఖీ చేసిన అధికారులు బంగారం ఉండటాన్ని గుర్తించారు. నిందితులు ఎల్సీడీ మానిటర్‌, ల్యాప్‌టాప్‌, ట్రాలీ బ్యాగ్‌లలో బంగారాన్ని దాచారు. దీంతోపాటు ఓ ప్రయాణికుడి ప్యాంట్‌లో బంగారాన్ని గుర్తించారు. దీని మొత్తం విలువ రూ.1.57 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు, విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts