Hyderabad: లోదుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిందితుడి అరెస్టు
కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విమానాశ్రయాల్లో బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ ఈకే 528 విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 823 గ్రాముల బంగారు ముద్దను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేస్తున్న క్రమంలో.. ప్రయాణికుడు తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచిపెట్లినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
-
India News
Aadhaar-PAN: ఆధార్-పాన్ లింకు డెడ్‌లైన్ పొడిగించండి.. మోదీకి కాంగ్రెస్ లేఖ
-
Sports News
Venkatesh Prasad: కేఎల్ రాహుల్ పట్ల నేను కఠినంగా ప్రవర్తించలేదు : వెంకటేశ్ ప్రసాద్
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!