కడప జిల్లాలో భారీగా బంగారం పట్టివేత
కడప జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. జిల్లాలోని కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద 2.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హరినాథ్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముద్దనూరు..
ముద్దనూరు: కడప జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. జిల్లాలోని కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద 2.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హరినాథ్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వస్తున్న కారును నిలిపివేసి తనిఖీ చేయగా.. అందులో ఉన్న రెండు బ్యాగుల్లో 2.7 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. వెంటనే కారు డ్రైవర్ మహమ్మద్ షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పులివెందులలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం నుంచి మెరుగు పెట్టించడానికి ప్రొద్దుటూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోవటంతో కారుతో పాటు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.05 కోట్లు ఉంటుందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.
ఇవీ చదవండి..
తెదేపా సర్పంచి అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..