Crime News: దుబాయ్‌ నుంచి 7.69 కేజీల బంగారం.. శంషాబాద్‌లో పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. రెండు కేసుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 7.69 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు. 

Updated : 07 Oct 2022 18:31 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. రెండు కేసుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 7.69 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు. 

నిన్న ఉదయం దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 4.895 కేజీల బంగారం పట్టుకున్నారు.  సిలిండ్రకల్‌ సిల్వర్‌ కోటెడ్‌ బ్లాక్‌లో బంగారం తెచ్చినట్టు గుర్తించారు. మరో ఇద్దరు ప్రయాణికులు లోదుస్తుల్లో తీసుకొచ్చిన 2.800 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వివరించారు. రెండు విమానాల్లో దుబాయి నుంచి అక్రమంగా తెచ్చిన 7.69 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే కావడం గమనార్హం.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని