Crime News: గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పేరుతో భారీ మోసం.. సీసీఎస్‌ వద్ద బాధితుల ఆందోళన

గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరిట హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. దాదాపు 500 మందిని మోసగించి రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతోన్న వ్యాపారి రాజేశ్‌ను సీసీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

Published : 23 Jun 2024 16:13 IST

హైదరాబాద్‌: గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. దాదాపు 500 మందిని మోసగించి రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతోన్న వ్యాపారి రాజేశ్‌ను సీసీఎస్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. హబ్సీగూడ స్ట్రీట్‌ నంబర్‌ 8లో ప్రహణేశ్వరి ట్రేడర్స్‌ పేరుతో రాజేశ్‌ అనే వ్యక్తి కార్యాలయం ఏర్పాటు చేశాడు. అధిక లాభాలు ఆశ చూపి ఒక్కొక్కరి వద్ద రూ.5లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసి పరారయ్యాడు. పెట్టుబడిగా పెట్టిన డబ్బును ఐదు నెలల్లో రెట్టంపు చేస్తామని, పెట్టుబడిలో 2 శాతం లాభాలను వారానికోసారి చెల్లిస్తామని నమ్మించి మోసం చేశాడని బాధితులు తెలిపారు. మొదట రెండు నెలలపాటు లాభాలను చెల్లించడంతో నమ్మకం కలిగి భారీ మొత్తంలో డబ్బులు అతడికి ఇచ్చినట్లు వాపోయారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని