ఆ విమానంలో RDXఉందంటూ పోలీసులకు కాల్‌!

విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఆకతాయిలు చేసిన ఫోన్‌ కాల్ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుబాయి- ముంబయి విమానంలో........

Published : 18 Jul 2021 01:35 IST

ముంబయి విమానాశ్రయంలో కలకలం

ముంబయి: విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఆకతాయిలు చేసిన ఫోన్‌ కాల్ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుబాయి- ముంబయి విమానంలో సోదాలు చేయగా ఏమీ దొరకలేదని వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి - ముంబయి విమానంలో ఆర్డీఎక్స్‌ ఉందంటూ ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.  విమానంలో సోదాలు చేయగా.. ఏమీ దొరకలేదు. దర్యాప్తులో దీన్ని ఫేక్‌ ఫోన్‌కాల్‌గా గుర్తించాం’’ అని పేర్కొన్నారు. ముంబయి పోలీసులకు ఇలాంటి నకిలీ ఫోన్‌కాల్స్‌ కొత్తేమీకాదు. గతంలో కూడా ఇలాంటి కాల్స్‌ వచ్చాయి. జూన్‌లో మహారాష్ట్ర సచివాలయంలో బాంబు పెట్టినట్టు 53 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వానికి ఈ-మెయిల్‌ చేసి అరెస్టయ్యాడు. చివరకు తన కొడుకుకు స్కూల్‌లో అడ్మిషన్‌ దొరకకపోవడంతో తీవ్ర ఆవేదనతోనే ఇలా చేశానని పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని