నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి పరిహారం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష(19) హత్య నేపథ్యంలో బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ పరిహారం ప్రకటించారు. రూ.10లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్‌కలెక్టర్‌ శ్రీవాసునుపుర్‌ అజయ్‌కుమార్‌ బాధిత కుటుంబానికి అందించారు. అనూషను తోటి విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఠాణాకు వెళ్లి పోలీసులకు

Updated : 25 Feb 2021 13:50 IST

నరసరావుపేట (లీగల్‌): గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష(19) హత్య నేపథ్యంలో బాధిత కుటుంబానికి జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌ పరిహారం ప్రకటించారు. రూ.10లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్‌కలెక్టర్‌ శ్రీవాసునుపుర్‌ అజయ్‌కుమార్‌ బాధిత కుటుంబానికి అందించారు. అనూషను తోటి విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు, కళాశాల విద్యార్థులు ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద నుంచి మృతదేహంతో ర్యాలీగా పల్నాడు బస్టాండ్‌ కూడలికి చేరుకుని ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ధర్నా కొనసాగించారు. మధ్యలో పోలీసులు, ఇతర అధికారులు వచ్చి మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. సబ్‌కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబసభ్యులతో చర్చలు జరిపినా వారు ఆందోళన విరమించలేదు.

ఈ ఆందోళనకు తెదేపా, సీపీఐ పార్టీలతో పాటు ఏఐఎస్ఎఫ్‌ సహా వివిధ సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సత్తెనపల్లి తెదేపా నేత కోడెల శివరాం, నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జ్‌ అరవిందబాబు తదితరులు ఆందోళన జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. వారు కూడా ధర్నాలో పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సబ్‌కలెక్టర్‌ ఈ పరిణామాలపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఉన్నతాధికారులతో చర్చించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. అనంతరం దానికి సంబంధించిన ఉత్వర్వులను బాధిత కుటుంబానికి అందజేయడంతో రాత్రి 9.30గంటల సమయంలో వారు ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని స్వగ్రామం ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి తరలించారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని