Crime news: లైంగిక వేధింపులపై 15మంది విద్యార్థినుల ఫిర్యాదు.. టీచర్‌ అరెస్టు!

ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 15మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ......

Published : 25 Dec 2021 01:16 IST

చెన్నై: ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ 15 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థినుల ఆరోపణలతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. మరో ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారుల సంరక్షణపై తమ పాఠశాలలో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అనంతరం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థినులు తమ కష్టాల్ని ఏకరవు పెట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు. పాఠశాలలో మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌ బోధిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

తరగతి గదిలో ద్వంద్వ అర్థాలు వచ్చేలా మాట్లాడటం, అనుచితంగా తమపై చేతులు వేయడం, తరగతులు పూర్తయ్యాక కూడా తరచూ ఫోన్‌ చేసి మాట్లాడం వంటి చేష్టలకు పాల్పడేవారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. బాలికల నుంచి ఫిర్యాదు అందుకున్న అనంతరం సోషల్‌ సైన్స్‌ బోధించే టీచర్‌ని అరెస్టు చేసినట్టు తెలిపారు. మరో ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి, బాలల హక్కుల అధికారులతో పాటు మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు