Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్‌!

పెళ్లి వేడుకలో వరుడు ధరించిన డబ్బుల దండను ఓ యువకుడు తెంచుకొని పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published : 29 Jan 2023 01:14 IST

దిల్లీ: ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. బంధుమిత్రులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. మెడలో డబ్బుల దండ వేసుకొని వరుడు గుర్రం ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఈలోగా ఓ 14 ఏళ్ల బాలుడు ఆ దండ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. వరుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. రూ.500 నోట్లు  దాదాపు 329 ఉపయోగించి ఈ దండను తయారు చేసినట్లు వరుడి తరఫువారు చెబుతున్నారు. అయితే, దండను తెంచే క్రమంలో 79 నోట్లు కింద పడిపోగా వాటిని రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి ఆచూకీ కోసం వివాహం జరుగుతున్న ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని