Gujarat: కండోమ్‌ మరిచిపోయి అసహజ రీతిలో!.. చివరికి ఏమైందంటే?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు  చెందిన ఓ వ్యక్తి కండోమ్‌కి బదులు జిగురును వినియోగించి మృత్యువాతపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.....

Published : 26 Aug 2021 01:26 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు  చెందిన ఓ వ్యక్తి కండోమ్‌కు బదులు జిగురులాంటి పదార్థాన్ని వినియోగించి అసహజ రీతిలో కలయికలో పాల్గొని మృత్యువాతపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌ (25) అనే యువకుడు జూన్‌ 23న తన ఇంటి సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కొందరు గమనించారు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. సల్మాన్ ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. అతడు అసహజ రీతిలో కలయికలో పాల్గొనడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు నిర్ధరించారు.

అసలు ఏమైందంటే..?

సల్మాన్‌ జూన్‌ 22న తన ప్రేయసితో కలిసి ఓ హోటల్‌కు వెళ్లాడు. వెంట కండోమ్‌ తీసుకెళ్లడం మర్చిపోయిన సల్మాన్‌ దానికి బదులు జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను వినియోగించాడు. దాని ప్రభావం వల్ల అతడి మర్మాంగం సహా పలు అవయవాలు చెడిపోయి మృత్యువాతపడ్డాడు. కండోమ్‌ను తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే వారు ఆ జిగురును వినియోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సల్మాన్‌తోపాటు అతడి ప్రియురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారినట్లు గుర్తించారు. అహ్మదాబాద్‌ 7వ జోన్‌ డీసీపీ ప్రేమ్‌సుఖ్‌ మాట్లాడుతూ సల్మాన్‌ తాజా పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదని.. అది వచ్చాక ఈ విషయంపై మరింత స్పష్టత రానున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని