CBI: అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మొదటి అంతస్తు నుంచి దూకేసి!

సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేస్తారన్న భయంతో అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న ఓ బిల్డర్‌ మొదటి అంతస్తు నుంచి దూకేశాడు 

Published : 24 Feb 2023 00:23 IST

గురుగ్రామ్‌: మోసం, అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న ఓ బిల్డర్‌ని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లగా.. అది గమనించిన నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగావ్‌ గ్రామ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దిల్లీకి చెందిన సంజీవ్‌ కుమార్‌ అనే బిల్డర్‌ గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 72 టాటా ప్రిమంటి సొసైటీలో నివసిస్తున్నాడు. ఓ అవినీతి కేసులో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. సంజీవ్‌ ఆచూకీ కనుగొన్న సీబీఐ అధికారులు సొసైటీ గేటు దగ్గర సెక్యూరీ గార్డులతో మాట్లాడుతుండగా... అది గమనించిన సంజీవ్‌ తప్పించుకునేందుకు మొదటి అంతస్తు నుంచి దూకేశాడు. వెంటనే సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి కాళ్లు విరిగిపోవడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరక మెరుగైన వైద్యం కోసం మేదాంత ఆస్పత్రిలో చేర్చారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని