Hyderabad: మునుగోడు ఉపఎన్నిక వేళ.. హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్‌లో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జుమ్మేరాత్‌ బజార్‌ వద్ద నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 21 Oct 2022 18:36 IST

హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా జుమ్మేరాత్‌ బజార్‌ వద్ద నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారి నుంచి కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. షాహినాత్‌గంజ్‌కు చెందిన కమలేశ్‌, అశోక్‌ కుమార్‌, రతన్‌సింగ్‌, గోషామహల్‌కు చెందిన రాహుల్‌ అగర్వాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతోనే ఈ ముఠా హవాలా సొమ్ము తరలింపు మార్గాన్ని ఎంచుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, ఎవరి ఆదేశాలతో ఎక్కడ నుంచి ఎక్కడికి డబ్బు తీసుకెళ్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ హవాలా సొమ్ముతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని