Murder Case: హయత్‌నగర్‌లో వృద్ధురాలి హత్య.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

తొర్రూర్‌లో హత్యకు గురైన వృద్ధురాలి కేసును హయత్‌నగర్‌ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు.

Published : 05 Jun 2023 21:42 IST

హైదరాబాద్‌: నగరశివారులోని హయత్‌నగర్‌ మండలం తొర్రూరులో హత్యకు గురైన వృద్ధురాలు సత్తమ్మ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు హయత్‌నగర్‌ పోలీసులు వెల్లడించారు. నిందితులను అద్దెకుంటున్న మహిళ లలిత, పక్కింటి యువకుడు రాకేశ్‌గా గుర్తించారు. బంగారం కోసమే సత్తమ్మను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.‘‘ వృద్ధురాలిని చంపి నిందితులు 23 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. బీరువాలో ఉన్న నగలు, నగదు జోలికి వెళ్లలేదు’’ అని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు