సజ్జనార్‌ను కలిసిన హేమంత్‌ కుటుంబ సభ్యులు 

హేమంత్‌ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హేమంత్‌ కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాణహాని...

Updated : 30 Sep 2020 17:22 IST

హైదరాబాద్‌: హేమంత్‌ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు బుధవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హేమంత్‌ కుటుంబ సభ్యులతో పాటు తనకు కూడా ప్రాణహాని ఉందని హేమంత్‌ భార్య అవంతి సీపీ సజ్జనార్‌కు వివరించారు. హేమంత్‌ హత్య తరువాత జరిగిన పరిణామాలను సీపీకి వెల్లడించారు.

ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల హత్యకు గురైన హేమంత్‌ కేసు విచారణకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని సీపీ వీసీ సజ్జనార్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈకేసులో ఎవరినీ వదిలి పెట్టబోమని, నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని సజ్జనార్‌ బాధితులకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని