Drugs: విమానాశ్రయంలో రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

ముంబయిలో మరోసారి భారీగా డ్రగ్స్‌(Drugs) పట్టుబడ్డాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం(Mumbai Airport)లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 16కిలోల హెరాయిన్‌(Heroin)ను సీజ్‌ చేశారు.

Published : 07 Oct 2022 01:33 IST

ముంబయి: ముంబయిలో మరోసారి భారీగా డ్రగ్స్‌(Drugs) పట్టుబడ్డాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం(Mumbai Airport)లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు 16కిలోల హెరాయిన్‌(Heroin)ను సీజ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఓ ప్రయాణికుడితో పాటు ఘనాకు చెందిన ఓ మహిళను అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఆఫ్రికాలోని మలావి నుంచి ఖతార్‌ మీదుగా ముంబయికి వెళ్తున్న ప్రయాణికుడు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకోసం మంగళవారం ప్రత్యేక నిఘా బృందాన్ని విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనుమానితుడి లగేజీని తనిఖీ చేయగా.. ట్రాలీ బ్యాగులో 16 కిలోల హెరాయిన్‌ ఉన్నట్టు గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్‌ని డెలివరీ చేసేందుకు వచ్చి దిల్లీలోని ఓ హోటల్‌లో ఉంటున్న ఘనాకు చెందిన మహిళను అరెస్టు చేశారు. దిల్లీ కోర్టు మంజూరు చేసిన ట్రాన్సిట్‌ రిమాండ్‌పై ఆమెను ముంబయికి తీసుకొచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని