Drugs: గాజుల్లో రూ.7.5 కోట్ల హెరాయిన్‌

దాదాపు రూ.7.5 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు.....

Updated : 04 Jul 2021 14:19 IST

దిల్లీ: దాదాపు రూ.7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్‌లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్‌ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా నుంచి దిల్లీలోని ఓ అడ్రస్‌కు పంపారు. మరోవైపు గత వారమే ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్థులు 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని