Drugs: భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. రూ. 9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత

దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.....

Updated : 20 Sep 2021 13:01 IST

అహ్మదాబాద్‌: దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుజరాత్‌లో రూ. 9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. అయితే ఈ డ్రగ్స్‌ ముఠాకు విజయవాడతో సంబంధాలు ఉండటం గమనార్హం. నిఘా వర్గాల సమాచారంతో.. డీఆర్‌ఐ అధికారులు గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో తనిఖీలు చేయగా భారీగా హెరాయిన్‌ బయటపడింది. వాటి విలువ దాదాపు రూ. 9వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కంటైనర్లు అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ కంటైనర్లు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ ట్రేడింగ్‌ సంస్థకు చెందినవిగా గుర్తించారు. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని