Drugs: లెహెంగాలో ₹3కోట్ల డ్రగ్స్‌.. బెంగళూరులో స్వాధీనం!

స్మగ్లరు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. మత్తుపదార్థాలను తరలించడానికి కొత్తకొత్త దారులు వెతుకుతున్నాయి. అయినా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు వారి పప్పులు ఉడకనీయడం లేదు.

Published : 24 Oct 2021 01:19 IST

బెంగళూరు: స్మగ్లరు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. మత్తుపదార్థాలను తరలించడానికి కొత్తకొత్త దారులు వెతుకుతున్నాయి. అయినా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు వారి పప్పులు ఉడకనీయడం లేదు. బెంగళూరులో ఇలాగే అతి తెలివి ప్రదర్శించిన స్మగ్లర్ల ఆటకట్టించారు ఎన్‌సీబీ అధికారులు. ఆస్ట్రేలియాలోని భారత సంతతి అమ్మాయిల పెళ్లి కోసమని రవాణా అవుతున్న పార్సిల్‌ ఒకటి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. విప్పి చూస్తే అందులో మూడు లెహెంగాలు. కానీ కాస్త పరీక్షగా చూసే సరికి అందులో కేజీ చొప్పున మూడు కేజీల డ్రగ్స్‌ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ.3 కోట్లవరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ రాకెట్‌తో సంబంధం ఉందని భావిస్తున్న ఒక వ్యక్తిని ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో సరైన సమయంలో మెరుపుదాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ అధికారుల బృందానికి ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ అమిత్‌ ఘవాటే నాయకత్వం వహించారు. ఈ షిప్‌మెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం నుంచి వచ్చిందని, చెన్నై ద్వారా అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పంపించేలా ఆర్డర్‌ బుక్‌ చేశారని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని చిరునామా ఆధారంగా ప్రధాన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. నకిలీ ధ్రువపత్రాలు, చిరునామా సమర్పించి ఈ పార్సిల్‌ బుక్‌ చేశారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని