Crime News: వైకాపా నేత హత్యపై నిరసన.. సింగరాయకొండలో ఉద్రిక్తత

పాత కక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను లారీతో ఢీకొట్టి కిరాతకంగా...

Updated : 23 Sep 2022 11:45 IST

ఒంగోలు (నేరవిభాగం): పాత కక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను లారీతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేసిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో గురువారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో సింగరాయకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని సింగరాయకొండ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్న వ్యక్తుల్లో కొందరు పోలీసుస్టేషన్‌ గోడ దూకి వెళ్లి లారీకి నిప్పంటించారు. గమనించిన పోలీసులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అంతటితో ఆగకుండా ఆందోళనకారులు పోలీసు స్టేషన్‌ ఎదుట ఉన్న చలివేంద్రాన్ని తగులబెట్టారు. పట్టణంలోని దుకాణాలను మూసివేయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఒంగోలు నుంచి వచ్చిన పోలీసు బలగాలు సింగరాయకొండలో మోహరించారు. డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ లక్ష్మణ్‌, ఎస్సై ఫిరోజా ఫాతిమా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని