పరువు హత్య.. కూతురు వరసయ్యే యువతిని పెళ్లి చేసుకున్నాడని దారుణం!

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య జరిగింది.

Published : 19 Sep 2023 20:04 IST

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య జరిగింది. కరణ్‌ కుమార్‌ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రంజిత్‌, బంధువులు కలిసి అతడిని కొట్టి చంపారు. కూతురు వరుస అయ్యే యువతిని పెళ్లి చేసుకోవడంపై ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ యువకుడికి ఆ కుటుంబంతో బంధుత్వం ఉండటం గమనార్హం. కుమార్తె వరుస అయ్యే యువతిని పెళ్లాడటంతో కరణ్‌ను చంపి పొలంలో పాతి పెట్టారు. ఈ ఘటనలో రంజిత్‌కు ఇద్దరు బాలురు సాయం చేసినట్టు సమాచారం. కరణ్‌ కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌ నుంచి వచ్చిన రంజిత్‌, కరణ్‌ కుటుంబాలు షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు