Delhi: కడుపులో దాచిన కొకైన్‌.. విలువ రూ.కోట్లలోనే..

నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం సృష్టిస్తోంది. దిల్లీ విమానాశ్రయంలో బుధవారం 992 గ్రాముల కొకైన్‌ను

Updated : 30 Dec 2021 05:57 IST

దిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ప్రతీకాత్మక చిత్రం

దిల్లీ: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల పట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. దిల్లీ విమానాశ్రయంలో బుధవారం 992 గ్రాముల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ భారీగానే ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఉగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాత్రల రూపంలో ఉన్న ఈ కొకైన్‌ను సదరు మహిళ కడుపులో దాచి దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 91 కొకైన్‌ క్యాప్సుల్స్‌ని మహిళ మింగినట్లు అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని