Hyderabad: మహిళలకు కమీషన్‌ ఆశ చూపించి గంజాయి తరలింపు.. ముఠా అరెస్టు

గంజాయి సరఫరాకు అంతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమీషన్ అశ చూపించి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్‌నగర్‌ పోలీసులు

Published : 23 May 2022 15:28 IST

హైదరాబాద్: గంజాయి సరఫరాకు అంతరాష్ట్ర ముఠాలు కొత్త దారులు వెతుకుతున్నాయి. మహిళలకు కమీషన్ అశ చూపించి ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 470 కిలోల గంజాయి, 4 కార్లు, 11 సెల్‌ఫోన్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు ఆయినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

‘‘ఈ కేసులో ప్రధాన నిందితులు శ్రీకాంత్, రాహుల్‌ కలిసి పలు రాష్ట్రాల్లో ఉన్న గంజాయి డీలర్లతో సంబంధాలు పెట్టుకుని గంజాయి సరఫరా చేస్తున్నారు. నిన్న తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి గ్రామం నుంచి నాలుగు వాహనాల్లో 470 కిలోల గంజాయిని నిందితులు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మహారాష్ట్రకు తరలించేందుకు ప్రయత్నించారు. నలుగురు నిందితులు వేరే కారులోకి గంజాయిని మారుస్తున్న సమయంలో పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నాం. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఆరుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు’’ అని సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని