Gold seized: నెల్లూరు, హైదరాబాద్‌లో 10.27 కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తంగా 10.27 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు.

Updated : 10 Jun 2023 15:16 IST

నెల్లూరు: హైదరాబాద్‌, నెల్లూరు జిల్లాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తంగా 10.27 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో టోల్‌ గేట్‌ వైపు వచ్చిన కారును తనిఖీ చేయగా.. సీటు కింద దాచి తరలిస్తున్న 7.798 కిలోల విదేశీ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. హైదరాబాద్‌లో మరోచోట అక్రమ బంగారం ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే మరో బృందం ఆ ప్రాంతానికి చేరుకొని 2.471 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు క్యారియర్లు, ఒక రిసీవర్‌ను జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు