crime news: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.22 కోట్లు విలువైన హెరాయిన్‌ పట్టివేత

నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తంలో డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహిళా ప్రయాణికురాలి నుంచి

Updated : 25 Apr 2022 18:39 IST

మహిళ అరెస్టు.. జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలింపు: డీఆర్‌ఐ అధికారులు

శంషాబాద్: నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ మొత్తంలో డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహిళా ప్రయాణికురాలి నుంచి 3.12 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ ఖతార్‌ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌ వచ్చింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్‌ను రెండు తెల్లటి కవర్స్‌లో చుట్టి ట్రాలీబ్యాగ్ కింది‌ భాగంలో దాచి తీసుకొచ్చింది. ముందస్తు సమాచారం మేరకు విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు నిఘా పెట్టారు. ఆమె లగేజీని తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్‌ను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ విలువ సుమారు రూ.21.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ప్రయాణికురాలిపై కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. నిందితురాలిని జుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని